breaking news
Junior World Cup Hockey
-
తొమ్మిదేళ్ల తర్వాత...సెమీస్‌లో భారత్
పోష్‌స్ట్రూమ్: తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు తొమ్మిదేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచకప్‌లో మరోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చిన భారత జట్టు క్వార్టర్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే దాడులకు పదునుపెట్టిన అమ్మాయిలు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్రిండికి (15వ ని.లో), సంగీత (41వ ని.లో) ఒక్కో గోల్ చేసి జట్టును గెలిపించారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2013 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీస్ చేరింది. అప్పుడు సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతకపోరులో ఇంగ్లండ్‌ను 3–2తో పెనాల్టీ షూటౌట్లో ఓడించి పతకం గెలుచుకుంది. 2016 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. -
భారత్ అదరహో...
►15 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత ►సెమీస్‌లో షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపు ►రేపు బెల్జియంతో టైటిల్ పోరు ►జూనియర్ ప్రపంచకప్ హాకీ సొంతగడ్డపై మూడేళ్ల క్రితం ఎదురైన నిరాశను మరిపించేలా భారత హాకీ యువ ఆటగాళ్లు మెరిశారు. జూనియర్ ప్రపంచకప్‌లో అంతిమ సమరానికి అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షూటౌట్లో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో 15 ఏళ్ల తర్వాత టైటిల్ పోరుకు చేరుకున్నారు. బెల్జియంతో ఆదివారం జరిగే ఫైనల్లోనూ గెలిచి 15 ఏళ్ల ప్రపంచకప్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నారు. లక్నో: జాతీయ క్రీడ మళ్లీ జిగేల్మంది. సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 4–2తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించారు. ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో బెల్జియం ‘షూటౌట్’లో 4–3తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్ చివరిసారి 2001లో టైటిల్‌ను సాధించింది. 2013లో స్వదేశంలోనే జరిగిన ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో గోల్‌కీపర్ వికాస్ దహియా ఆస్ట్రేలియా ఆటగాళ్ల రెండు షాట్స్‌ను నిలువరించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. భారత్ తరఫున హర్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమీత్, మన్‌ప్రీత్ జూనియర్ సఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... మాథ్యూ బర్డ్, షార్ప్ లాచ్లన్ కొట్టిన షాట్లను భారత గోల్‌కీపర్ వికాస్ దహియా అడ్డుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో భారత్ ఐదో షాట్‌ను తీసుకోలేదు. రెగ్యులర్ సమయంలో ఆట 14వ నిమిషంలో టామ్ క్రెయిగ్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 42వ నిమిషంలో గుర్జంత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. 48వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే 57వ నిమిషంలో షార్ప్ లాచ్లన్ గోల్‌తో ఆసీస్ స్కోరును 2–2తో సమం చేసింది. అనంతరం తర్వాత 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడానికి తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. -
భారత్ హ్యాట్రిక్ విజయం
-
భారత్ హ్యాట్రిక్ విజయం
లక్నో: జూనియర్ ప్రపంచకప్ హాకీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ అందుకు తగ్గట్లే అంచనాలను మించి దూసుకెళుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2–1తో జయభేరి మోగించింది. పూల్ ‘డి’లో వరుసగా మూడో విజయంతో పూల్ టాపర్‌గా నిలిచింది. ఈనెల 15న జరిగే క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ తో భారత్ తలపడుతుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆరంభం నుంచి చెలరేగి ఆడారు. టీమిండియా తరఫున కెప్టెన్ హర్జీత్ సింగ్ (11వ ని.లో), మన్ దీప్ సింగ్ (55వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ పూల్ నుంచి భారత్‌తో పాటు ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత పొందింది.