సూరి మండాడికి డేట్‌ ఫిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

సూరి మండాడికి డేట్‌ ఫిక్స్‌

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

తమిళసినిమా: విడుదలై చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తిన హాస్య నటుడు సూరి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలా ఈయ న తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్‌ ఎస్‌.ఇన్ఫోటెయిన్‌ మెంట్‌ పతాకంపై ఎల్‌రెడ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి మదిమారన్‌ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌ నటుడు సుహాస్‌ కీలక పాత్రలో పరిచయం అవుతున్నారు. నటుడు సత్యరాజ్‌, రవీంద్ర విజయ్‌, మిథున్‌, బాలా శరవణన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, ఎస్‌ఆర్‌.కదీర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది సముద్ర తీర ప్రాంతంలోని మత్చ్యకారుల జీవన విధానాన్ని, సముద్రంలో సాహసోపేతమైన బోటుల పోటీలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత ఎల్‌రెడ్‌.కుమార్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం నటుడు సూరి పూర్తిగా మేకోవర్‌ అయ్యినట్టు చెప్పారు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పారు. చిత్రం టైటిల్‌, గ్లింప్స్‌ను విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందన్నారు. చిత్ర ఆడియో, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మండాడి చిత్రాన్ని సెప్టెంబర్‌ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement