న్యాయం ఇతివృత్తంతో నిళల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యాయం ఇతివృత్తంతో నిళల్‌

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

తమిళసినిమా: చట్టం ధనవంతులకు చుట్టంగా మారుతుందనే చాలా కాలంగా జరుగుతున్న చర్చ. ఒక్కోసారి పోలీస్‌ వ్యవస్థ కూడా గొప్పోళ్లకు గులాం చేస్తుంది. అలాంటప్పుడు సగటు మనిషికి న్యాయస్థానంలో న్యాయం ఎలా జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి తదితర కథాంశంతో రూపొందిన చిత్రం నిళల్‌. ఒక ప్రేమైక కుటుంబం, ఇద్దరు కవల పిల్లలను తల్లిదండ్రులు ప్రేమానురాగాలతో పెంచి ప్రయోజకులను చేస్తారు. అందులో ఒక యువతి ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తుంది. ఇంకొకరు క్రీడాకారిణి. అలా ఆనందంగా సాగిపోతున్న వారి కు టుంబంలో అనూహ్య సంఘటన జరుగుతుంది. ఆ ఇద్దరు కవ ల పిల్లల్లో ఒకరిపై హత్యాయత్నం జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో క్రైమ్‌ థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన కథా చిత్రం నిళల్‌. చిత్రం ధన మదాందుల దుర్మార్గాలు, ప్రతిఘటనలు, పోలీసులు, న్యాయస్థానం చుట్టూ తిరుగుతుంది. బాధితులు న్యాయం కోసం పోరాడగా, హంతకులు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా న్యాయంపై అన్యా యం పైచేయి అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే ఇతివృత్తంతో రూ పొందిన ఈ చిత్రాన్ని ఏకే.మూవీస్‌ పతాకంపై ఏకే.కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నటి జనని, కౌశిక్‌, శిరి వికాస్‌, దివ్య కృష్ణన్‌, హరి విజయ్‌, రమేష్‌ ఖన్నా, అభిషేక్‌ శంకర్‌, సబితా ఆనంద్‌, కలైమామణి శివన్‌ శ్రీనివాసన్‌, దిలీపన్‌, బాయ్స్‌ రాజన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి అబుబకర్‌ సంగీతాన్ని అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement