వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్దనంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయగూరలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోంహర నామ స్మరణాల మధ్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివారిని అధికార నందీ వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయగూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.
నంది భగవాన్‌కు అభిషేకం చేస్తున్న శివాచార్యులు, హాజరైన భక్తులు


