తిరుత్తణి: షోళింగర్‌లో బైపాస్ రోడ్డు ఏర్పాటును ప్రత్యామ్నాయ మార్గంలో నిర్మించాలనే కోరిక మేరకు గ్రామీణులు తిరుత్తణి ఆర్డీఓను శుక్రవారం కలుసుకుని వినతిపత్రం అందజేశారు. షోళింగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా హైవేశాఖ ద్వారా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి స్థలం స్వాధీనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పట్టణ శివారులో ఆర్కేపేట మండలంలోని పద్మాపురం గ్రామం ద్వారా బైపాస్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. దీంతో ఆందోళన చెందిన ఆ గ్రామానికి చెందిన 50 మంది తిరుత్తణిలోని ఆర్డీఓ కణిమొళిని కలుసుకుని తమ సమస్య వివరించారు తమ గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మిస్తే తాము కష్టపడి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు కోల్పోవాల్సి ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇందుకు రాణిపేట హైవేశాఖ అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ రాణిపేట జిల్లా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రైల్లో 1.5 కిలోల నగలు చోరీ
అన్నానగర్: గురువాయూర్ నుంచి చైన్నెకి వెళుతున్న రైలులో ఒక బంగారు ఆభరణాల దుకాణ ఉద్యోగి నుంచి ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితులు ముగ్గురిని రైల్వే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1,083 గ్రాముల బంగారు కడ్డీలు, రూ. 47 లక్షల నగదును కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూర్‌కు చెందిన జోస్ (47) గత నెల 6వ తేదీ రాత్రి 11.15 గంటలకు, కేరళలోని గురువాయూర్ నుంచి చైన్నెకి రిజర్వేషన్ చేసుకొనివెళుతున్నాడు. అతని వద్ద తన యజమాని జయసన్ నైల్లెలోని వల్లియూర్ జ్యువెలర్స్‌కు పంపిన 1473.97 గ్రాముల బంగారు ఆభరణాలను అతను ఒక భుజం సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. రాత్రి అతను బ్యాగును తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున రైలు కులీతురై సమీపానికి చేరుకున్నప్పుడు, జోస్ మేల్కొని చూడగా, నగలు ఉన్న సంచి కనిపించలేదు. అతను, కుళీతురై రైల్వేస్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో, అభా ఠాకిర్, డోలీ సిద్ధిక్, గోపకుమార్, సరబుద్దీన్, రంజిత వీరు జోస్ ప్రయాణిస్తున్న రిజర్‌వ్డ్ కంపార్ట్‌మెంట్‌లో అతడిని వెంబడిస్తున్నారని, అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని నగల సంచిని దొంగిలించి, కుళీతురై రైల్వేస్టేషన్‌లో పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. చైన్నె సైబర్ క్రైమ్ రైల్వే పోలీసుల సాయంతో, కేరళలో మోహరించిన ప్రత్యేక పోలీసు దళం, సెల్ ఫోన్ టవర్‌కు అందిన నంబర్లను పరిశీలించడం ద్వారా, నగల దొంగలు ఉపయోగించిన సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా త్రిశూర్‌లో దాక్కున్న అబు ఠాకిర్, డోలీ గోపకుమార్, సర్ పుతిన్ సిద్ధిఖీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసులు పట్టుకున్న 8 మంది నుంచి 1083.930 గ్రాముల విలువైన 5 బంగారు కడ్డీలు, రూ.47 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


