అభివృద్ధి పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జౌళి, ఖాదీ శాఖా మంత్రి, వేలూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి విజయ్‌బాలా జీ అన్నారు. మొట్టమొదటి సారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్‌మురుగన్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం విజయ్‌ పుట్టినరోజు పురష్కరించుకొని వేలూరులోని జననీ బిగ్‌బజారు అధినేత సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వేలూ రు అన్నారోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యేలు వినోద్‌కన్నన్‌, సుధాకర్‌, తెండ్రల్‌కుమార్‌, కూ టమి పార్టీ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహీద్‌బాషా, టీవీకే పార్టీ జిల్లా కోశాధికారి ప్రశాంత్‌, న్యాయ వాది దాస్‌, నాగరాజ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వేలూరులోని ప్రభుత్వ వసతి గృహంలో అధికారులతో పాటు కార్యకర్తలను పరిచయం చేసుకొని అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement