తేనికి తరలి వచ్చిన సినీలోకం | - | Sakshi
Sakshi News home page

తేనికి తరలి వచ్చిన సినీలోకం

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా తేనికి తరలివచ్చారు. కవి వైరముత్తు, నటి రాధికా శరత్‌కుమార్‌, సుహాసిని, నిరోషా, దీప, నటులు భాగ్యరాజా, పార్తీబన్‌, వడివేలు, సముద్రఖని, నిలగళ్‌ రవి, శ్రీరామ్‌, కరుణాస్‌, విఘ్నేష్‌, దర్శకులు ఆర్‌.కె. సెల్వమణి, పేరరసు, రామ్‌, సీమాన్‌, అమీర్‌, మాజీ సీఎం పన్నీరు సెల్వం, మాజీ మంత్రి ఐ.పెరియసామి, ఎంపీలు వెంకటేశన్‌, తంగ తమిళ్‌ సెల్వన్‌, సీపీఎం నేత షణ్ముగం, అన్నాడీఎంకే సీనియర్‌ నేత సెల్లూరు రాజు తదితరలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కడసారిగా భారతీ రాజాపార్తీవ దేహం వద్ద కన్నీటి అంజలి ఘటించారు. నటుడు వడివేలు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ దశలో ఆయన సొమ్మ సిల్లే పరిస్థితి నెలకొంది. బంధువులు , ఆప్తులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. తేని పరిసర గ్రామాలలోని వృద్ధులు పెద్ద ఎత్తున వచ్చి అంజలి ఘటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement