చివరి కోరిక నెరవేర్చిన కుమార్తె.. | - | Sakshi
Sakshi News home page

చివరి కోరిక నెరవేర్చిన కుమార్తె..

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

అనారోగ్యంతో మలేషియాలోని తన కుమార్తె జనని ఇంట్లో చికిత్స పొందుతున్న సమయంలో, భారతీరాజా తన అంతిమ కోరికను ఆమెకు తెలియజేశారు. ‘‘ నేను చనిపోయాక నన్ను చైన్నెలో వద్దు, నేను పుట్టిన తేని జిల్లాలోని వత్తలకుండు ఘాట్‌ రోడ్‌ ఫామ్‌హౌస్‌లో పాతిపెట్టండి. అక్కడైతేనే నేను అమ్మఒడిలో ఉన్నట్లు ప్రశాంతంగా నిద్రపోగలను’’ అని కుమార్తెతో ఆప్యాయంగా చెప్పారు. తండ్రి చివరి కోరికను జనని అక్షరాలా ప్రస్తుతం నెరవేర్చారు. దీంతో గురువారం అంతా చైన్నె నీలాంకరై నివాసంలో పార్తీవ దేహాన్ని ఉంచారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తేనికి తరలించారు. దారి పొడవున అక్కడక్కడ అభిమానులు పార్తీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement