న్యూస్‌రీల్
● ప్రభుత్వ అధికారులు, విద్యార్థుల దిగ్భ్రాంతి
కొరుక్కుపేట:విల్లుపురం జిల్లాలోని ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల 11వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లూసీ నిర్మల్ మడోన్నా, షేక్ అబ్దుల్ రెహమాన్, పీఎంకే ఎమ్మెల్యే శివకుమార్ హాజరయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ ప్రత్యేక అతిథిగా హాజరై, 2020–26 విద్యా సంవత్సరంలో వైద్య విద్యను పూర్తి చేసిన 89 మంది విద్యార్థినులకు (బాలురు, బాలికలు) డిగ్రీలను ప్రదానం చేసి, ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆ సమయంలో వైద్య విద్యార్థులు అంకితభావంతో సమాజంలోని నిమ్న వర్గాలకు సేవ చేయాలని ఆయన అన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ విద్యార్థుల హక్కులకు, రాష్ట్రానికి వ్యతిరేకమని, ’ఒకే దేశానికి ఒక ఎన్నిక’ అన్నట్లుగా ఇది కూడా ఐక్యతా సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. వైద్య విద్యను రాష్ట్ర విద్యా జాబితా పరిధిలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. మంత్రి తన ప్రసంగాన్ని ముగించిన కొద్ది క్షణాలకే, ’తమిళ జెండా ఎగుర వేసి టీవీకే పార్టీ గీతాన్ని ప్లే చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ గీతాన్ని ప్లే చేయడం పట్ల అక్కడ ఉన్న అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి కార్యక్రమానికి అప్పటికే ఆలస్యంగా రావడంతో, చివరలో గ్రూప్ ఫోటో కోసం విద్యార్థులను వేచి ఉండేలా చేశారు. ఆ సమయంలో, హాలులో ఒక విద్యార్థి అకస్మాత్తుగా సృహ కోల్పోవడంతో, కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
రాజ్యసభకు ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, చైన్నె : తమిళనాడు నుండి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఈ మేరకు తమిళనాడు శాసనసభ అధికారి, ఎన్నికల అధికారి గువవుఆరం సాయంత్రం ప్రకటించారు. తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం గత నెల 7న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు శాసనసభలోని అధికార పక్షం, దాని మిత్రపక్షాల బలాన్ని బట్టి ఈ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తికి టీవీకే చీఫ్, సీఎం విజయ్ కేటాయించారు. గడువు ముగిసే సమయానికి బలమైన ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారికంగా ధృవీకరించింది.తమిళనాడు అసెంబ్లీ సభ్యుల మద్దతుతో ఎన్నికై న ప్రవీణ్ చక్రవర్తి త్వరలోనే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


