చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..! | - | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

తమిళసినిమా: ప్రేమ, యాక్షన్‌, సెంటిమెంట్‌ వంటి కమర్షియల్‌ అంశాలతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి.తాజాగా రూపొందిన అలాంటి చిత్రం హబిబి. ఒక మధ్య తరగతికి చెందిన ఇస్లామిక్‌ కుటుంబం నేపధ్యంలో రూపొందిన చిత్రం ఇది. మూడు తరాలుగా చేనేత వృత్తి నమ్ముకుని అత్యంత సాధారణ జీవితాన్ని అనుభవించే ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి, సంతోషంగా జీవించాలని భావించి, కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను కూడా వదిలి దుబాయ్‌కి వెళ్తాడు. అక్కడ పలు ఏళ్లు పని చేసే సంపాదించిన డబ్బుతో సొంత ఊరికి తిరిగి వస్తాడు. అదే విధంగా తన అన్నయ్య కొడుకును కూడా దుబాయ్‌ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే చదువుకునే రోజుల్లోనే సహా విద్యార్థినిపై మనసు పడ్డ అతను ఆమెకు దూరం కావడం ఇష్టం లేక దుబాయ్‌ కి వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రేయసికి దూరం కావలిసిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో అతను కూడా దుబాయ్‌ కి వెళ్తాడు. తిరిగి వచ్చిన తరువాత మరో యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఆ పెళ్లి జరిగిందా ? మొదట ప్రేమించిన యువతి ఏమైయ్యింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో అత్యంత సహజత్వంగా రూపొందిన చిత్రం హబిబి. ఇస్లామీయ సమాజంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లలను యధార్థంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి మీరా కదిరవన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీనియర్‌ దర్శకుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి మాళవిక మనోజ్‌ మరో ముఖ్య పాత్రను పోషించారు. శ్యామ్‌ సి ఎస్‌.సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నేశం ఎంటర్‌ టైన్మెంట్‌ ,జీకేఎస్‌ బ్రోస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్ణయించాయి.కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్‌ అధినేత రాహుల్‌ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రం గత 110 ఏళ్ల సినీ చరిత్రలో రాలేదని ప్రధాన పాత్రను పోషించిన దర్శకుడు కస్తూరి రాజా పేర్కొన్నారు.

తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. అయితే కొందరు ఇందుకు భిన్నంగా తమ కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటారు. అలాంటి వారిలో నటి అవంతిక సుందర్‌ చేరుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుందర్‌ .సీ, నటి కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందించే అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఆనందిత చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ప్రొడక్షన్స్‌ కార్యక్రమాల్లో పని చేసిన అనుభవంతో ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తి డబుల్‌ ఆక్యుపెంసీ అనే చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఇక సుందర్‌ సి, కుష్బూ మరో వారసురాలు అవంతిక విషయానికి వస్తే ఈ బ్యూటీ కథానాయకిగా రంగప్రవేశం చేశారు. అయితే ఈ చిన్నది మొదట మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఆరంభం అనే చిత్రంలో కథానాయికిగా నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే కోలీవుడ్‌ అవకాశాన్ని అందుకున్నారు. నటుడు ధనుష్‌ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎప్నడీ కోపం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యిన పవీష్‌ తాజాగా నటిస్తున్న రెండవ చిత్రంలో అవంతిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు పా.రంజిత్‌ శిష్యుడు ధామో నాగభూషణం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన కథ, దర్శకత్వం బాధ్యతలను ఈ చిత్రానికి అట్టాకర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది వాలీబాల్‌ క్రీడ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఇండియాకు చెందిన పలువురు వాలీబాల్‌ క్రీడాకారులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిపారు. అట్టాకర్‌ చిత్ర షూటింగ్‌ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటోందని యూనిట్‌ వర్గాలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ చిత్రానికి సినిమా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌్‌ పతాకంపై దినేష్‌ రాజ్‌ నిర్మిస్తున్నారు.

నటి అవంతిక సుందర్‌

కోలీవుడ్‌ ఎంట్రీ షురూ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement