క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

ప్లాస్టిక్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం ● రూ.50 లక్షల ఆస్తి నష్టం చైన్నె జిల్లాలో మైనారిటీలకు రుణాలు ఇద్దరు బైకు దొంగల అరెస్ట్‌ ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్‌ శ్రీవారి దర్శనానికి 18 గంటలు

వేలూరు: ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని వీసీ మోటూరు గ్రామానికి చెందిన వినాయకం. ఇతనికి సొంతమైన అట్ట, ప్టాస్టిక్‌ వస్తువుల గోడౌన్‌ ఉంది. బుధవారం రాత్రి హఠాత్తుగా గోడౌన్‌ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే రాణిపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ప్లాస్టిక్‌ వస్తువులు కావడంతో మంటలను అదుపు చేసేందుకు కుదరలేదు. దీంతో 10 అగ్నిమాపక వాహనాలు, గంటల పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. అప్పటికే గోడౌన్‌లో నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువ చేసే వస్తువులు అప్పటికే పూర్తిగా దగ్ధమయ్యాయి, ఈ మేరకు వాలాజ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం పూర్తిగా పొగతో నిండుకుంది.

కొరుక్కుపేట: తమిళనాడు మైనారిటీల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా చైన్నె జిల్లాలో వివిధ రుణ పథకాలను అమలు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.మాలతిహెలెన్‌ అభ్యర్థించారు. ఈ విషయమై జారీచేసిన పత్రికా ప్రకటనలో ఆమె పేర్కొంటూ మైనారిటీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఈడీసీ), చైన్నె జిల్లాలో నివసిస్తున్న వివిధ మైనారిటీ వర్గాలకు ఉపాధి కోసం, ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలను ప్రారంభించడం కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. ఈపథకం కింద, వ్యక్తిగత, స్వయం సహాయక బృందాలకు చిన్న వ్యాపార, చేతి వృత్తుల వారికి, విద్యా పత్రాల రుణాలు అమలు చేస్తారని, ఈ రుణాలను పొందేందుకు, లబ్ధిదారుల ఆదా యం ఆధారంగా రెండు వేర్వేరు పథకాలను విభజించారు. ఆమేరకు పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారి వార్షిక కుటుంబ ఆదాయం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రూ.3లక్షలు మించకూడదన్నారు.

వేలూరు: తిరుపత్తూరు జిల్లా కెరటి ప్రాంతానికి చెందిన పయణి ఇతను గత కొద్ది రోజుల క్రితం తన బైకును ఇంటి ముందు నిలిపి ఉన్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైకును చోరీ చేసి తీసుకెళ్లారు. అదే విధంగా అదే ప్రాంతంలో తరచూ బైకులు చోరీ జరుగుతున్నట్లు పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చింది. దీంతో పలువురు తిరుపత్తూరు పోలీసులకు బైకు చోరీ కేసుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వీటిపై విచారణ చేపట్టారు. వీటిపై పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. తిరుపత్తూరు ప్రాంతం సమీపంలోని చెల్లరపట్టి గ్రామానికి చెందిన క్రిష్ణన్‌ తరచూ బైకు చోరీలు చేసినట్లు తెలియ వచ్చింది. దీంతో పోలీసులు క్రిష్ణన్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. క్రిష్ణన్‌ తరచూ మద్యం అలవాటు ఉండటంతో మద్యం సేవించడానికి ఇంటి సమీపంలో నిలిపి ఉన్న బైకులను చోరీ చేసి వాటిని రావతంబట్టి గ్రామానికి చెందిన ప్రతాప్‌కు విక్రయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులను అరెస్టు చేశారు.

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి తమిళ్‌కాలనీలోకి సమీపంలోని స్మశానం వద్ద కొందరు యువకులు గంజాయిని నిల్వ వుంచి విక్రయిస్తున్నట్టు ఆరణి పోలీసులకు రహస్య సమాచారం అందింది.సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అక్కడ అనుమానస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు ఆరణి ప్రాంతానికి చెందిన బాలాజీ(26), నరేష్‌(23), శింగపెరుమాల్‌ ఆలయం ప్రాంతానికి చెందిన చిరంజీవి(21)గా గుర్తించారు. వీరు ఆంధ్ర నుంచి గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్టు నిర్ధాచించారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్‌లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పొన్నేరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుతుంది. సర్వ దర్శనానికి 18గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 86,124 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,520 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement