స్విస్‌ ప్రతినిధులతో మంత్రి ఆనంద్‌ భేటీ | - | Sakshi
Sakshi News home page

స్విస్‌ ప్రతినిధులతో మంత్రి ఆనంద్‌ భేటీ

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

● బ్యానర్లు వద్దని కేడర్‌కు వినతి

సాక్షి, చైన్నె: తమిళనాడులో స్విస్‌ ‘గ్రీన్‌ శానిటేషన్‌’ ప్రాజెక్ట్‌ గురించి స్విస్‌ ప్రతినిధి బృందంతో గురువారం మంత్రి ఆనంద్‌ సమావేశమయ్యారు. తమిళనాడు గ్రామీణాభివద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఎన్‌. ఆనంద్‌ ను స్విట్జర్లాండ్‌కు చెందిన ని–వాటర్‌ సంస్థ ప్రతినిధులు బృందం కలిశారు. వి లివ్‌ సస్టెయిన్‌ ప్రోగ్రామ్‌ మేరకు ఈ సంస్థ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా రసాయన రహిత క్లీనింగ్‌ , జల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అమలు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో స్విస్‌ ని–వాటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ, స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ మాజీ సభ్యుడైన డాక్టర్‌ గిలాడ్‌ బెగ్లేతో పాటు కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బ్యానర్లు, కటౌట్లు పెడితే కఠిన చర్యలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌ జూన్‌ 22న జరుపుకోబోతున్న మొదటి పుట్టినరోజు సందర్భంగా హంగు ఆర్భాటాలకు చెక్‌ పెట్టారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఆనంద్‌ నేతృత్వంలో పనయూరులోని టీవీకే కార్యాలయంలో సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు.బ్యానర్‌ సంస్కతికి పూర్తిగా స్వస్తి పలకాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వారికి ఆనంద్‌ వివరించారు. టీవీకే తరఫున జరిగే ఏ కార్యక్రమాల్లోనూ బ్యానర్లు కనిపించకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఏ ఒక్కరూ ప్రవర్తించరాదని స్పష్టం చేశారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, నిరుపేదలకు అపూర్వమైన రీతిలో భారీ ఎత్తున సంక్షేమ సహాయం అందించాలని పిలుపు నిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement