కొరుక్కుపేట: మహిళలు, పిల్లల రక్షణ కోసం ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సింగప్పెన్ ప్రత్యేక కార్యదళాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సింగప్పెన్‌శ్రీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రాజెక్ట్ కోసం 2,545 కొత్త పోస్టులను సృష్టించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పోస్టుల కోసం రూ.354 కోట్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరుసటి రోజే దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడింది. ఆమేరకు 49 జిల్లా కేంద్రాల్లో 343 ఇన్‌న్‌స్పెక్టర్ పోస్టులు, 98 ఎస్‌ఐలు, 196 గ్రేడ్–2 పోలీస్ కానిస్టేబుళ్లు, 270 ఫీల్డ్ యూనిట్లకు 540 మంది మహిళా ఎస్‌ఐలు, 1,620 మంది మహిళా పోలీస్ అధికారులు, కంట్రోల్ రూమ్ సాంకేతిక విభాగంలో 2 ఇన్‌స్పెక్టర్లు , 3 ఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది 12 పోస్టులు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.
వేలూరు: ఆంబూరు సమీపంలో ఒకే రోజు రాత్రి మొత్తం నాలుగు ఇళ్లలో చోరీ జరగడం సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని పెరియాంకుప్పం కారక్కల్ వీధిలో మొత్తం నాలుగు ఇళ్లలో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంటిలోని బంగారం, వెండి వంటి వాటిని చోరీ చేశారు. ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అవాకై ్కన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు గ్రామంలోనికి చొరబడి గ్రామంలోని సీసీటీవి కెమరాలను తనఖీ చేస్తున్నారు. డీఎస్పీ నాగలింగం కేసు విచారణ చేస్తున్నారు.
తిరువొత్తియూరు: పొల్లాచ్చి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి హెల్మెట్లు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై పట్టా కత్తులు పట్టుకుని బైక్‌పై చెక్కర్లు కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. పొల్లాచ్చి–ఉడుమలై రోడ్డులోని కోలార్ పట్టి వద్ద ఉన్న ఒక పాత ఇనుప దుకాణం వద్దకు దుండగులు పట్టా కత్తులతో ఆప్రాంతంలో తిరుగుతూ కనిపించారు. సీసీటీవీ కెమెరాలో ఒక వ్యక్తి కత్తిని తిప్పుతూ దుకాణం తలుపు తట్టాడు. లోపల ఉన్న వ్యక్తి శబ్దం విని తలుపు కొద్దిగా తీసి చూడగా, దుండగులు లోపలికి చొరబడడానికి ప్రయత్నించారు. లోపల ఉన్న వ్యక్తి అప్రమత్తమై తలుపు వేసి గడియ పెట్టుకోవడంతో దుండగుల ప్రయత్నం విఫలమైంది. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోమంగళం పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


