ప్రజల అర్జీలపై స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల అర్జీలపై స్పందించాలి

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

ప్రజల అర్జీలపై స్పందించాలి

పళ్లిపట్టు: ప్రజల అర్జీలపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే తహసీల్దార్‌కు సూచించారు. పళ్లిపట్టు తహసీల్దార్‌ భారతిని తిరుత్తణి ఎమ్మెల్యే హరి బుధవారం కలుసుకున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు వెంటనే అందేందుకు అధికారులు కృషిచేయాలని, పేదలు ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందే విధంగా అధికారులు అర్జీలు పరిశీలించి వీలైనంత న్యాయం చేయాలని, అర్జీల పట్ల కాలయాపన చేయకుండా వెను వెంటనే స్పందించాలని, వీఆర్వోలు గ్రామాల్లో వుంటూ సేవచేయాలని అధికారులను కోరారు. ఉచిత ఇంటి పట్టాలు, వృద్ధాప్య పింఛన్లు, సహా వివిధ సర్టిఫికెట్లు కోసం అధికారులు, ఉత్సాహంగా విధులు నిర్వహించి నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ ఉత్తమ ససేవలందించాలని కోరారు. అన్నాడీఎంకే యూనియన్‌ కార్యదర్శులు కృష్ణమనాయుడు, టీడీ.శ్రీనివాసన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement