తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

వేలూరు: వేలూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్‌ బాబు అన్నారు. వేలూరు అన్నారోడ్డులోని జెప్డీ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం జరిగింది. ముందుగా సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ్యులు వివిధ సమస్యలపై సమీక్షించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ సమస్యలపై సమీక్షించడంతో పాలు పలు తీర్మాణాలను చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement