వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు హెచ్‌ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ప్రియ అన్నారు. రాణిపేట జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిన హెచ్‌ఎంలు, అదనపు హెచ్‌ఎంలతో కలెక్టర్ సమీక్ష సమావేశం రాణిపేట కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫ్లస్‌టు, పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకంజలో ఉందని వీటిని పెంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుల పైనే ఉందన్నారు. కార్పోరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యా ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. పాఠశాలలో ఒక టీచరు మాత్రమే ప్రయత్నం చేస్తే విజయం సాధించలేరని విద్యార్థులు, టీచర్‌లు కలిసి ఒకటిగా ప్రయత్నం చేస్తేనే విజయం సాధించ వచ్చాన్నారు. విద్యాశాఖ సీఈఓ మేగల, డీఈఓ శివరామన్, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


