విమానంలో మహిళ ప్రసవం | Flight passenger gives birth before plane lands | Sakshi
Sakshi News home page

విమానంలో మహిళ ప్రసవం

Apr 29 2026 4:05 AM | Updated on Apr 29 2026 4:05 AM

Flight passenger gives birth before plane lands

వాషింగ్టన్‌: అమెరికాలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో గత శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అట్లాంటా నుంచి బయలుదేరిన ఈ విమానం ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే, గమ్యస్థానానికి చేరుకోకముందే విమానంలో ఉన్న గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి.

యాదృచ్ఛికంగా అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు ఆమెకు సుఖ ప్రసవం కావడానికి సహకరించారు. బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా 2.5 కిలోల బరువుతో జన్మించింది. శిశువుకు బ్రియెల్లీ రెనీ బ్లెయిర్‌ అని నామకరణం చేశారు. అయితే, డాక్టర్‌ నిర్ధారించిన గడువు కంటే రెండు వారాల ముందు ఆమె జన్మించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement