ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 30-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Apr 30 2026 3:46 AM | Updated on Apr 30 2026 4:50 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: శు.చతుర్దశి రా.8.21 వరకు, తదుపరి పౌర్ణమి; నక్షత్రం: చిత్త రా.1.36 వరకు, తదుపరి స్వాతి; వర్జ్యం: ఉ.8.40 నుండి 10.22 వరకు; దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.41 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.43 వరకు; అమృత ఘడియలు:  సా.6.50  నుండి 8.30 వరకు; నృసింహ జయంతి

సూర్యోదయం : 5.39
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం....  ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం...  ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం...  వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం...  నూతన ఉద్యోగయోగం. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. విందువినోదాలు.

సింహం...  వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య...  కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

తుల...  శుభకార్యాల రీత్యా ఖర్చులు. అదనపు ఆదాయం. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం...  సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు...  పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.

మకరం...  కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.

కుంభం...  పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం....  మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి.

Advertisement
 
Advertisement
Advertisement