ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 27-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు

Apr 27 2026 3:49 AM | Updated on Apr 27 2026 5:18 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: శు.ఏకాదశి రా.7.59 వరకు, తదుపరి ద్వాదశి; నక్షత్రం: పుబ్బ  రా.10.58 వరకు, తదుపరి ఉత్తర; వర్జ్యం: ఉ.7.02 నుండి 8.37 వరకు; దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు; అమృత ఘడియలు: 4.36 నుండి  6.10 వరకు. సర్వ ఏకాదశి

సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం...  బంధువులతో కొన్ని వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం...  ఆర్థిక పరిస్థితి  నిరాశ పరుస్తుంది.  బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా   బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం. పనులలో ప్రతిష్ఠంభన.

మిథునం....  కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు ఊహించని అవకాశాలు. దైవచింతన.

కర్కాటకం...  కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం.....  చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వాహన, గృహయోగాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య....  రుణాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.  కళాకారులకు అవార్డులు రాగలవు.

తుల....  శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పూర్వవైభవం. వస్తులాభాలు.

వృశ్చికం.........  ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.

ధనుస్సు...  కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

మకరం.....  వ్యవహారాలు కొంత మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

కుంభం..  కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం..  నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement