గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.అష్టమి రా.11.45 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: పుష్యమి రా.12.29 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.9.16 నుండి 10.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.02 వరకు తదుపరి ప.12.22 నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: రా.6.23 నుండి 7.55 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ తప్పదు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. విద్యార్థులకు నిరుత్సాహం. .
వృషభం.. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలకమైన నిర్ణయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.
మిథునం..... శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
కర్కాటకం.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
సింహం.... ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కన్య.... కొన్ని బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
తుల...... నూతన విద్య, ఉద్యోగ లాభాలు. పనులు చకచకా సాగుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం... ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణయత్నాలు. పనులు వాయిదా. విద్యార్థులకు శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు..... కుటుంబసభ్యులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
మకరం..... చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
కుంభం.... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మీనం.... కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.


