ఈ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 23-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి మిత్రుల నుంచి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

Apr 23 2026 3:50 AM | Updated on Apr 23 2026 4:49 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.సప్తమి రా.1.42 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు రా.1.41 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.2.23 నుండి 3.53 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: రా.11.24 నుండి 12.54 వరకు.

సూర్యోదయం : 5.43
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం..... నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే..

మిథునం...... శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.

కర్కాటకం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య.... మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

తుల.... ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనుకోని ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృశ్చికం... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

ధనుస్సు..... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మకరం.... నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. కుటుంబసౌఖ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

మీనం... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

Advertisement
 
Advertisement
Advertisement