ఈ రాశి వారికి సోదరుల నుంచి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 21-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సోదరుల నుంచి ధన, వస్తులాభాలు

Apr 21 2026 3:48 AM | Updated on Apr 21 2026 4:16 AM

Rasi Phalalu: Daily Horoscope On 21-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.చవితి ఉ.8.39 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి ఉ.6.20 వరకు, తదుపరి మృగశిర తె.4.40 వరకు, వర్జ్యం: ప.11.33 నుండి 1.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.13 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.48 నుండి 11.34 వరకు, అమృత ఘడియలు: రా.8.26 నుండి  9.11 వరకు, శంకర జయంతి.

సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం..... కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం... కొత్త మిత్రుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. సన్మానాలు.

మిథునం... రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

కర్కాటకం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు.

సింహం..... ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య..... బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు.

తుల.... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం... బంధువులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. కుటుంబసౌఖ్యం.

ధనుస్సు.... ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం... ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు చేస్తారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.

మీనం.. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి. 

Advertisement
 
Advertisement
Advertisement