గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.తదియ ఉ.11.05 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: కృత్తిక ఉ.8.00 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.10.54, నుండి 12.23 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: ఉ.5.46 నుండి 7.15 వరకు, తిరిగి రా.3.20 నుండి 4.50 వరకు, అక్షయ తృతీయ.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం తప్పదు. కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.
వృషభం... నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. .
మిథునం... ఓర్పుతో ముందుకు సాగండి. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం.... ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. దైవదర్శనాలు.
సింహం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వృద్ధి..
కన్య.... బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.
తుల..... పనుల్లో తొందరపాటు. బాధ్యతలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.
వృశ్చికం... ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
ధనుస్సు... కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనయోగం.
మకరం.... పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.
కుంభం.... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మీనం.... కొత్త వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.


