ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 17-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Apr 17 2026 3:46 AM | Updated on Apr 17 2026 4:36 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: అమావాస్య సా.5.31 వరకు, తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: రేవతి ప.12.05 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.13 వరకు, అమృత ఘడియలు: ఉ.9.46 నుండి 11.18 వరకు, తదుపరి తె.4.07 నుండి 5.36 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం.... కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. రుణబాధలు తొలగుతాయి. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం.... ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కర్కాటకం.... ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

సింహం.... పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల.... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.

ధనుస్సు... శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మకరం.... ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మీనం... మీ శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement