ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 16-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Apr 16 2026 3:36 AM | Updated on Apr 16 2026 4:14 AM

Rasi Phalalu: Daily Horoscope On 16-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.చతుర్దశి రా.7.08 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.12.54 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: రా.12.30 నుండి 2.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: ఉ.8.10 నుండి 9.46 వరకు.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం.. రుణభారాలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం.

వృషభం..... శుభకార్యాలకు హాజరవుతారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల  నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

కర్కాటకం..... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

సింహం.... పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

తుల..... పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం.

వృశ్చికం.... కుటుంబంలో కొత్త సమస్యలు. ముఖ్య వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు..... పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. సోదరులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం.... సన్నిహితులతో సఖ్యత. కొత్త పనులకు శ్రీకారం. ముఖ్య సమాచారం అందుతుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాం.

కుంభం.... ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మీనం... ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement