గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి రా.8.23 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.19, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.10.44 నుండి 12.19 వరకు, దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: లేవు, మాస శివరాత్రి.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
వృషభం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.
మిథునం..... కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. పనులలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కర్కాటకం.... కొన్ని పనులు వాయిదా వేయాల్సివస్తుంది. ప్రయాణాలు కుదించుకుంటారు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
సింహం.... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య..... గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
తుల..... ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.
వృశ్చికం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు.... మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం.... పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
కుంభం.. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
మీనం... సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.


