ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 01-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి

May 1 2026 4:16 AM | Updated on May 1 2026 4:16 AM

Rasi Phalalu: Daily Horoscope On 01-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: పౌర్ణమి రా.9.28 వరకు, తదుపరి బహుళ పాడ్యమి; నక్షత్రం: స్వాతి రా.3.26 వరకు, తదుపరి విశాఖ; వర్జ్యం: ఉ.7.37 నుండి 9.21 వరకు; దుర్ముహూర్తం:  ఉ.8.10 నుండి 9.00 వరకు, తదుపరి ప.12.22 నుండి 1.12 వరకు; అమృత ఘడియలు: సా.5.56 నుండి 7.10 వరకు; వైశాఖ పౌర్ణమి

సూర్యోదయం : 5.39
సూర్యాస్తమయం : 6.15
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం..  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. మిత్రుల నుంచి ధనలబ్ధి. పనులు చకచకా సాగుతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం....  కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం.....  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కర్కాటకం....సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

సింహం....  కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో పురోగతి. విందువినోదాలు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య....  మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల....  కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

వృశ్చికం....  ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

ధనుస్సు...  ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మకరం......  చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కుంభం...  సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం...  మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement