తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి | want to partners in the telangana reconstruction | Sakshi
Sakshi News home page

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి

Jul 13 2014 2:20 AM | Updated on Sep 2 2017 10:12 AM

తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

ఇల్లెందు: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఇల్లెందులో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలు ఆంధ్రలో కలపడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు

. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేస్తోందన్నారు.  త్వరలో జరగబోవు క్యాబినెట్ సమావేశంలో రూ.18 వేల కోట్లతో 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. జేకే 5 నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన మైన్స్ ఏర్పాటు కృషిచే స్తానన్నారు. ప్యాసింజర్ ైరె లు పునరుద్ధరణకు ఎంపీ సీతారాంనాయక్  కేంద్ర రైల్వేమంత్రితో మాట్లాడరని, త్వరలో రైలు సేవలు అందుబాలులోకి వస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే,  నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఊకె అబ్బయ్య, కౌన్సిలర్లు జానిపాషా, సామల రాథశ్రీ, ఎర్రోళ్ల తులసీరామ్‌గౌడ్,  నా యకులు దేవిలాల్‌నాయక్, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, నవీన్, సత్యనారయణ, కృష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా జగదాంబసెంటర్‌లో శ్రీ షిరిడీసాయి మందిరంలో నిర్వహించిన గురుపౌర్ణమి పూజా కార్యక్రమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్ణాహుతితో ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.

 సాయిబాబా ఊరేగింపు రథాన్ని పద్మ ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ మల్లికార్జున్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక కేఎన్‌ఎస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను నాయకులు పూలమాల, శాలువలతో ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement