లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరి మృతి | 2 died in a road accident | Sakshi
Sakshi News home page

లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరి మృతి

Aug 1 2015 6:59 AM | Updated on Sep 3 2017 6:35 AM

మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

కొత్తకోట(మహబూబ్‌నగర్): అతివేగంగా వెళ్తున్న డీసీఎం యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద శనివరా తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు వెళ్తున్న డీసీఎం పాలెం వద్దకు రాగానే యూ టర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టింది.

దీంతో డీసీఎంలో ఉన్న దస్తగిరి(35), లత్తు(42) అక్కడికక్కడే మృతిచెందగా.. సోమిరెడ్డి, మహబూబ్‌పాషలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆళ్లగడ్డ వాసులుగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement