ఒకేసారి ఇద్దరితో ప్రేమ | Warangal Heroine's Craze In Chennai | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఇద్దరితో ప్రేమ

Oct 27 2015 11:00 PM | Updated on Sep 3 2017 11:34 AM

ఒకేసారి ఇద్దరితో ప్రేమ

ఒకేసారి ఇద్దరితో ప్రేమ

ఆ కుర్రాడికి త్రిష, నయనతార అంటే ఇష్టం. అంత అందమైన అమ్మాయిలను మాత్రమే ప్రేమించాలని ఫిక్స్ అవుతాడు.

ఆ కుర్రాడికి త్రిష, నయనతార అంటే ఇష్టం. అంత అందమైన అమ్మాయిలను మాత్రమే ప్రేమించాలని ఫిక్స్ అవుతాడు. అనుకోకుండా ఇద్దర మ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తాడు. చివరికి ఇతని పరిస్థితి ఏమైందనే కథాంశంతో ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘త్రిష ఇల్లన్న నయనతార ’. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌కు మేనల్లుడూ, స్వయంగా మ్యూజిక్ డెరైక్టరైన జీవీ ప్రకాశ్‌కుమార్ ఈ సినిమాలో కథానాయక పాత్రధారి. ఆనందిని, మనీషా యాదవ్ నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ‘త్రిష లేదా నయనతార’ పేరుతో రుషి మీడియా పతాకంపై కృష్ణ, రమేశ్ తెలుగులో విడుదల చేయనున్నారు.

హైదరా బాద్‌లో జరిగిన పాటల వేడుకలో జీవీ ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ- ‘‘యూత్ ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడంతో పాటు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఇదొక బోల్డ్ మూవీ. యూత్‌కు కనెక్ట్ అవుతుంది. తమిళంలో లాగే తెలుగులో కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని ఆనందిని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement