
జేసీబీతో అడ్డుకట్ట వేస్తున్న దృశ్యం
నాగావళి ఎడమ కాలువ సైఫన్‌కు గండి పడడంతో సైఫన్‌కు నీరు రాకుండా ఒకటో బ్రాంచ్ ఎగువ భాగంలో 48 రోజుల క్రితం అధికారులు పూనులు వేశారు. అయితే ఎడమ కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో మంగళవారం ఎడమ కాలువలో ఉన్న పూను కొట్టుకుపోయింది. దీంతో ఈ నీరు సైఫన్ గుండా వచ్చి ఒట్టిగెడ్డలో కలిసిపోయింది. కాలువను పరిశీలించిన లస్కర్లు వెంటనే జేసీబీతో మళ్లీ పెద్ద అడ్డుకట్టను వేశారు.