
ఆలయం ఎదుట భక్తుల సందడి
పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్‌లో బారులు తీరారు.
పాల్వంచ రూరల్ : పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్‌లో బారులు తీరారు. అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. అర్చకులు పురాణం పురుషోత్తమశర్మ, శేషాద్రిశర్మ, రమేష్‌లు అమ్మవారిని పూలమాలలతో అలంకరించి అభిషేకాలు, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.