తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 5వ తేదీన చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల సాధన కోసం గుంటూరులో గల కార్యాలయం వద్ద ధర్నా
5న సహకార ఉద్యోగుల చలో గుంటూరు
Dec 3 2016 11:45 PM | Updated on Sep 4 2017 9:49 PM
రామచంద్రపురం :
తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 5వ తేదీన చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల సాధన కోసం గుంటూరులో గల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. రామచంద్రపురంలో అధ్యక్షుడు కె. ఆదినారాయణ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూనియ¯ŒS కోశాధికారి తోట వెంకటరామయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారన్నారు.
Advertisement
Advertisement