
2014 ఎన్నికల లోపు విభజన జరగదు: టీజీ
రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ జీ వెంకటేష్ స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ జీ వెంకటేష్ స్పష్టం చేశారు. అంతేకాదు దేశంలోని సగం రాష్ట్రాలు అంగీకరించాలని అన్నారు. అలాగే 371 (డి)ని సవరించాల్సిందేనని స్వయంగా భారత్ అటార్నీ జనరల్ స్పష్టం చేసిన సంగతిని ఈ సందర్బంగా టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. 2014 ఎన్నికల నాటికి ఆ సవరణలన్ని జరిగే పని కాదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగదని టీజీ వెంకటేష్ స్ఫష్టం చేశారు.