Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Questions AP Government Over Axis Power Deal1
నోరు మెదపరేం చంద్రబాబు!

సాక్షి,తాడేపల్లి: దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కూటమి సర్కార్‌ కనీవినీ ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. ఈ విద్యుత్‌ కొనుగోలుపై వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక యూనిట్‌ను రూ.2.49పైసలకే కొనుగోలు చేస్తే విషం చిమ్మిన మీరు ఇప్పుడు ఏకంగా రూ.4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు’అని ప్రశ్నించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వచ్చే 25 ఏళ్ల పాటు ఒక్క యూనిట్ విద్యుత్‌ను రూ.4.80కి కొనుగోలు చేయనుంది. ఈ ధర, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల కంటే రెండింతలు ఎక్కువ. దీని ప్రభావం రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడనుంది. అందుకే ఇది విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా నిలుస్తోంది. 'Axis' of Loot - 'Power'ed By Naidu-nomicsThe TDP-led coalition government has signed a power deal with Axis Energy to buy electricity at Rs 4.80 per unit for 25 years. This deal is almost double the rate of earlier agreements and will place a heavy burden on the people of… pic.twitter.com/UW7ueXBm97— YSR Congress Party (@YSRCParty) May 5, 2025మరి దీనిపై చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు. ఈ ఒప్పందం ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చే, ప్రజలకు భారమయ్యే ప్రణాళికతో చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ట్వీట్‌లో పేర్కొంది.

CM Revanth Reddy extremely angry with leaders of employee unions2
ఎవరిపై మీ సమరం?

ఈ సమయంలో సమరం కాదు..సమయస్ఫూర్తి కావాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను మనవి చేస్తున్నా. మనమంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపునకు అప్పగించొద్దు. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించుకుందాం – సీఎం రేవంత్‌రెడ్డిసాక్షి, హైదరాబాద్‌: ‘ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని నిందించదల్చుకున్నరు? ఎవరిని కొట్టదల్చుకున్నరు? ఉద్యోగా లిచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ యుద్ధం? ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన వాళ్లు.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల నాయకులను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నాం. సమరం చేయడానికి లేము. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన ‘తెలంగాణ పోలీస్‌ రియల్‌ హీరోస్‌ జీ అవార్డులు’ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 22 మంది పోలీస్‌ సిబ్బంది, అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నన్ను కోసినా రూపాయి రాదు.. ‘ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు. ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం. రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారవద్దని ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని.. ప్రభుత్వం సాఫీగా నడవొద్దని కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంటది. మీరు వాళ్ల ఉచ్చులో పడి వాళ్ల చేతుల్లో పావులుగా మారొద్దు. రాజకీయ నాయకుల చేతుల్లో చురకత్తుల్లా మారి ప్రజల గుండెల్లో గుచ్చితే అది గాయంగా మారుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా రాదు. నెలకు రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. వాస్తవ పరిస్థితి ఇది. మరి నన్ను ఏం చేస్తరు? నన్ను కోసుకొని వండుకొని తింటరా?’అని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుబారా తగ్గిస్తున్నా.. ‘ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా రూ. 22,500 కోట్లు కావాలి. ప్రభుత్వానికి వస్తున్న రూ. 18,500 కోట్లలో ప్రతి నెలా అప్పులకు రూ. 7 వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ. 5,500 కోట్లు పోను నా దగ్గర మిగిలేవి రూ. 6 వేల కోట్లు. దీనిలో ఏయే పథకాలు అమలు చేయాలి? అవకాశం ఉన్న ప్రతి దగ్గర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. సీఎం హోదాలో ఎక్కడికి పోయినా ప్రత్యేక విమానం తీసుకెళ్లే వెలుసుబాటు ఉన్నా మామూలు విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసే వెళ్తున్నా. దుబారా తగ్గిస్తున్నా’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఏది ఆపమంటారో మీరే ప్రజలకు చెప్పండి.. ‘మీ కోరికలు తీర్చాలంటే ఏం చేయాలి? కావాలంటే నేనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తా. 10 లక్షల మందిని కూడా తీసుకొస్తా. ఇట్లా చేస్తే బాగుంటదని సభలో మీ ఉద్యోగుల సంఘాల నాయకులే మాట్లాడండి. ఏ పథకం ఆపాలో మీరే ప్రజలకు చెప్పండి. ఫలానా పథకం ఆపేసి మేం జీతాలు పెంచుకుంటాం. బోనస్‌లు తీసుకుంటాం. మేం తిన్నాక మిగిలిందే మీకు ఇస్తామని ప్రజలకు చెప్పండి. లేదంటే రూ. 100 ఉన్న పెట్రోల్‌ రూ. 200 చేద్దామా? బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు ధరలు రెండింతలు చేద్దామా? మీరే చెప్పండి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. నిరసనలు, ధర్నాలు, బంద్‌లు చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. నాకు పోయేది కూడా ఏమీ లేదు. చిన్న గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే ప్రజలు నాకిచి్చన గొప్ప గౌరవం అనుకుంటా. ఆ గౌరవం బతికి ఉన్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టేందుకు పనిచేస్తా’అని సీఎం రేవంత్‌ చెప్పారు. అప్పంతా బకాయిలకే.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో తెచి్చన అప్పు రూ. 1.58 లక్షల కోట్లు. అందులో రూ. 1.52 లక్షల కోట్లు పాత అప్పులు, అసలు, మిత్తికి చెల్లించాం. గత ప్రభుత్వం మొత్తం రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలు పెట్టిపోయింది. మేం తెచ్చిన అప్పులో సొమ్మంతా పాత బకాయిలకు పోయింది తప్ప ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయాం. ఈ 16 నెలల్లో సరాసరిన నెలకు రూ. 9 వేల కోట్లు చెల్లించుకుంటూ వస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుందనే గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పెంచింది. ఇప్పుడు రిటైరవుతున్న వాళ్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కింద రూ. 8,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. వాటిని ఒకవైపు క్రమబద్ధీకరిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. అదనంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 500 బోనస్, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్లు, పేదల ఇళ్లకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 16 నెలల్లో కేవలం రైతులకే రూ. 30 వేల కోట్లను వాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేశా’అని సీఎం పేర్కొన్నారు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే దొంగల్లా చూస్తున్నరు.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పు పుడతలేదు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే తెలంగాణ ప్రతినిధులను దొంగల్లా చూస్తున్నరు. ఢిల్లీకి పోతే అపాయింట్‌మెంట్‌ కూడా ఇస్తలేరు. దేశం ముందు తెలంగాణది ఆ పరిస్థితి ఉంది. కుటుంబ పరువు తీయొద్దని కుటుంబ పెద్దగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వ లెక్కలు కావాలంటే ఆర్థికశాఖ అధికారుల వద్ద కూర్చొని చూడండి’అని సీఎం రేవంత్‌ ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. కేసీఆర్‌ది పైశాచిక ఆనందం.. ‘డైలీ ఫైనాన్స్‌లో రూ. 10 మిత్తికి తెచ్చుకొనే వాడికంటే అద్వానంగా అప్పులు తెచి్చపెట్టిండు ఆయన (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి). రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మీ సావు మీరు సావండని హ్యాపీగా ఫాంహౌస్‌లో దుప్పటి కప్పుకొని పడుకుండు. మూడు నెలలకొకసారి బయటికి వచ్చి అది ఫెయిల్‌.. ఇది ఫెయిల్‌ అని తిడతడు. రైతుబంధు ఫెయిల్‌ అని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పేటప్పుడు బాధతో కాదు.. ఆయన ముఖం వెయ్యి వోల్టుల బుల్బులా వెలుగుతది. ఇదేం పైశాచిక ఆనందం?’అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. నిమిషం నిర్లక్ష్యంగా ఉన్నా పోలీస్‌ శాఖకు చెడ్డపేరు.. ‘శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం. శాంతిభద్రతలు బాగున్నందునే 16 నెలల్లో రూ. 2.28 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగాం. దీనంతటికీ కారణం పోలీస్‌ శాఖ అని నేను గర్వంగా చెబుతున్నా. విధుల్లో ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా మొత్తం పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపి అణచివేయాలి, సైబర్‌ నేరాలను నియంత్రించాలి. పోలీస్‌శాఖకు అవసరమైన పూర్తి సహకారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్‌ సహా నగరాల్లో పోలీసులు చేపడుతున్న డ్రగ్స్‌ కట్టడి గ్రామీణ ప్రాంతాల్లోనూ పక్కాగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.

Sakshi Guest Column On JD Vance About Terror Attack3
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్‌ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్‌ బీట్‌ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్‌ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్‌లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్‌ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్‌ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్‌ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్‌ లోయలోని చిట్టిసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్‌ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్‌లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్‌వర్క్‌లలో అందు బాటులో ఉన్నదంతా పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్‌ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్‌ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్‌ లేదా డిజిటల్‌ మీడియాలలో పహల్గామ్‌ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్‌ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్‌ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్‌ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్‌ ్స ఫ్రంట్‌’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్‌ హ్యాక్‌ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్‌ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్‌లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్‌ లాడెన్‌ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్‌ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్‌ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్‌కు పాకిస్థాన్‌ సహకరించాలని వాన్‌ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్‌ 7 తర్వాత ఏ అమెరికన్‌ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్‌తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్‌ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్‌ లోపల... కశ్మీర్‌ వెలుపలా.!పహల్గామ్‌ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్‌లోనూ, కశ్మీర్‌ వెలుపల కూడా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్‌ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్‌వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి

Sakshi Editorial On Donald Trump4
మితవాదానికి మరో ఓటమి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గమనించుకుంటున్నారో లేదో గానీ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల కెనడా ఎన్నికల్లో ట్రంప్‌ పట్ల మెతకగా వ్యవహరించిన కన్సర్వేటివ్‌లు ఓటమిపాలై, ఊహించని రీతిలో అధికార లిబరల్‌ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది. అచ్చం ట్రంప్‌ విధానాలనే అనుకరిస్తూ ఆస్ట్రేలియా ఎన్నికల్లో తిరుగులేని గెలుపు సాధించాలనుకున్న విపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ అపజయాన్ని మూటకట్టుకోవటమే కాదు... ఆ పార్టీ గెలిస్తే ప్రధాని అవుతారనుకున్న నాయకుడు పీటర్‌ డటన్‌ సైతం ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత వరసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకున్న పార్టీగా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇక సింగపూర్‌లో ఎప్పటిలా పద్నాలుగోసారి సైతం అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) తిరిగి అధికారంలోకి రావటం వింతేమీ కాదుగానీ... ఆ పార్టీ నేత, ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ ప్రచారసభల్లో ట్రంప్‌పై రణభేరి మోగించారు. అమెరికా విధించిన సుంకా లకు ప్రతీకార సుంకాలుంటాయని ప్రకటించారు. అసలు అమెరికాకు సింగపూర్‌ నుంచి ఎగుమతులు చేసేదే లేదని స్పష్టం చేశారు. 97 స్థానాలున్న సభలో ఆ పార్టీ 87 స్థానాలు గెల్చుకోవటం గతంలో కూడా జరిగినా ఈసారి వోటు శాతాన్ని సైతం 66.57కి పెంచుకుని చరిత్ర సృష్టించింది. ఇక రుమేనియాలో మాత్రం ట్రంప్‌ను తలకెత్తుకున్న తీవ్ర మితవాదపక్షం అలయెన్స్‌ ఫర్‌ ది యూనిటీ ఆఫ్‌ రుమేనియన్స్‌ (ఏయూఆర్‌) నాయకుడు జార్జి సైమన్‌ తొలి రౌండ్‌లో గెలుపొందారు. ఈ నెల 18న జరగబోయే రెండో రౌండ్‌ ఎన్నికల్లో సైతం ఆయనదే విజయమన్న అంచనాలున్నాయి. వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగబోయే నార్వేలో కూడా ట్రంప్‌ ప్రభావం కనబడుతోంది. అక్కడి అధి కార లేబర్‌ పార్టీకి ఓటమి తప్పదని జనవరిలో వివిధ సర్వేలు ప్రకటించగా, ఆ మరుసటి నెలకల్లా అంతా మారిపోయింది. ఇప్పుడు లేబర్‌ పార్టీయే గెలుపుగుర్రంగా కనబడుతోంది.కరోనా దాపురించినప్పటి నుంచీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దేశంలో ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని తగ్గించటానికి ఆస్ట్రేలియా రిజర్వ్‌బ్యాంక్‌ 13 సార్లు వడ్డీరేట్లు పెంచింది. ఫలితం లేకపోగా అధిక ధరల కారణంగా కొనుగోళ్లు ఆగిపోయి గృహనిర్మాణ రంగం పడకేసింది. వీటన్నిటి వల్ల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవన్నీ చూసి తదుపరి ఎన్నికల్లో తమదే విజయమని కన్సర్వే టివ్‌ పార్టీ కలలుగంది. అమెరికాలో ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు చూసి అదే తరహా ప్రకటనలు చేసి ఆ పార్టీ నాయకుడు డటన్‌ మొదట్లో వోటర్ల మెప్పు పొందినమాట వాస్తవం. ప్రభుత్వ రంగంలో 40,000 ఉద్యోగాలు రద్దుచేస్తామని, వలసల విషయంలో కఠినంగా వుంటామని, ఉదార వాద విధానాలైన భిన్నత్వం, అందరినీ కలుపుకొనిపోవటం వగైరాలకు కాలం చెల్లిందని ఆయన పదే పదే ప్రకటించారు. ఆస్ట్రేలియా మొదటి నుంచీ అమెరికా మిత్ర దేశమే. అయినా ట్రంప్‌ ఏమాత్రం కనికరించలేదు. అందరితోపాటు ఆస్ట్రేలియాపైనా భారీయెత్తున సుంకాలు పెంచుతా మని ప్రకటించారు. ఇవింకా అమల్లోకి రాకపోయినా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థ మరింత అనిశ్చితిలోకి పోయింది. ఈ దశలో డటన్‌ తనకు ట్రంప్‌తో వున్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను సునాయాసంగా గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. కానీ ట్రంప్‌ దూకుడు కారణంగా స్టాక్‌ మార్కెట్లన్నీ బోల్తా కొట్టడంతో డటన్‌కు దిక్కుతోచలేదు. దాంతో ట్రంప్‌ ప్రస్తావన మానుకున్నారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. జనం లేబర్‌ పార్టీకే వోటేయాలన్న నిర్ణయానికొచ్చారు. సింగపూర్‌ సైతం ఆర్థిక అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. అసలే వాణిజ్యం దెబ్బతిని వుండగా ట్రంప్‌ అధిక సుంకాల ప్రకటన మరింత దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా మాదిరే ఆ దేశంలోనూ పౌరులకు సొంతిళ్లు సమకూర్చుకోవటం సమస్యగా మారింది. పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, ఉద్యో గాలు కోల్పోతామన్న భయాందోళనలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంచనాల కన్నా జీడీపీ చాలా తగ్గి 3.8 శాతానికొచ్చింది. వచ్చే త్రైమాసికంలో అది 2 శాతం మించక పోవచ్చు. ట్రంప్‌ సుంకాల బెదిరింపు సరేసరి. అందుకే ఈ అనిశ్చితిలో పాలకపక్షాన్నే మరోసారి గెలిపించటం ఉత్తమమన్న నిర్ణయానికొచ్చారు. కనుకనే పీఏపీ వోట్ల శాతం 61.2 నుంచి 65.67కి పెరి గింది. సింగపూర్‌ ఎన్నికల్ని విదేశీ మదుపుదార్లు, అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు శ్రద్ధగా గమనించాయి. ఈ అయిదేళ్లూ సింగపూర్‌ ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి మరి.ఏతావతా ఇప్పటికి ఒక్క రుమేనియా మినహాయించి ట్రంప్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్న నాయకులంతా ఊహించని ఓటమితో ఖంగుతింటున్నారు. నిరుడంతా మితవాద పక్షాలు ఎక్కడి కక్కడ విజయం సాధించగా, ప్రస్తుతం ఆ పక్షాలకు ఎదురుగాలి వీస్తోంది. అయితే గెలిచిన పక్షాలు చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభాలకు ఎదురీదటం, జనం మెప్పు పొందటం అంత సులభమేమీ కాదు. ప్రపంచంతోపాటే మనమూ అని ఈ సంక్షోభాల్ని సరిపెట్టుకునే పరిస్థితుల్లో వారు లేరు. కనుక సమస్యలకు దీటైన పరిష్కారాలు కనుగొనటానికి గద్దెనెక్కిన నాయకులు ప్రయత్నించాల్సి వుంది. వారి మాటెలావున్నా ప్రపంచమంతటా తన కారణంగా మితవాద పక్షాలు బోల్తా కొట్టడాన్ని చూసైనా ట్రంప్‌ తన విధానాలను మార్చుకుంటారా, లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

RBI doubles gold purchases to 57. 5 tonnes in FY255
ఆర్‌బీఐ ఖజానాలో పసిడి మెరుపులు

ముంబై: పసిడిపై ఆర్‌బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్‌బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్‌బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్‌బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్‌బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్‌ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్‌బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్‌ నాటికి 510.46 టన్నులకు పెంచుకుంది. ఫారెక్స్‌ నిల్వల్లో 11.70 శాతం.. ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్‌) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్‌ నాటికి 706 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.

earthquake in telangana6
earthquake: తెలంగాణలో పలు చోట్ల భూకంపం

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్‌ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్‌ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Pat Cummin Becomes First-Ever Captain With THIS Record7
ప్యాట్‌ కమ్మిన్స్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. త‌న అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాప‌ర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే క‌రుణ్ నాయ‌ర్‌ను ఔట్ చేసి త‌న జ‌ట్టుకు అద్బుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ త‌ర్వాత మూడో ఓవ‌ర్ మొద‌ట బంతికి ఫాఫ్ డుప్లెసిస్‌, ఐదో ఓవ‌ర్ మొద‌టి బంతికి అభిషేక్ పోరెల్‌ను క‌మ్మిన్స్ పెవిలియ‌న్‌కు పంపాడు. క‌మ్మిన్స్‌ ఓవ‌రాల్‌గా త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 19 ప‌రుగులిచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో క‌మ్మిన్స్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో అత్య‌ధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా క‌మ్మిన్స్ చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లే ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేకపోయాడు. అక్షర్ పటేల్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), జహీర్ ఖాన్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), షాన్ పోలాక్‌(ముంబై ఇండియన్స్‌) వంటి కెప్టెన్లు ఐపీఎల్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని కమ్మిన్స్ అధిగమించాడు.మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల న‌ష్టానికి ఢిల్లీ 133 ప‌రుగులు చేసింది. 29 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీని స్ట‌బ్స్‌(41 నాటౌట్‌), ఆశుతోష్ శ‌ర్మ‌(41) ఆదుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్ మూడు, ఉన‌ద్క‌ట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, మలింగ తలా వికెట్ సాధించారు.

Mock drills across states in India on May 78
Mock drills: భారత్‌లో మాక్‌ డ్రిల్‌.. 1971భారత్-పాక్‌ యుద్ధ సమయంలో

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ జరిగింది. అదే సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్,‌ హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.

Heavy Rain In Hyderabad May 5th9
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షంఅనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. Raining in Nampally #HyderabadRains pic.twitter.com/Np4eJ5jUlN— Weatherman Karthikk (@telangana_rains) May 5, 2025 #Hyderabadrains Now scattered intense thunder storm rains for going in Hyderabad City not good news for #SRHvsDC Hope after 10:30 rain reduce chance high let's see ⛈️⚠️ pic.twitter.com/I6KNqEDfYK— Telangana state Weatherman (@tharun25_t) May 5, 2025 Lighting caught on camera in Tolichowki SHAIKPET Manikonda Golconda areas#tolichowki#manikonda#Hyderabad #hyderabadrains@balaji25_t @Hyderabadrains pic.twitter.com/jOWHSnLLSH— TajKeProperties (@Mawt777) May 5, 2025

UPI Users Would Experience Better Transaction Services From 2025 June 16th10
UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement