
టెల్ అవీవ్: తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ‘ మీరు ఒక క్షిపణి దాడిని మాపై ప్రయోగించారు. దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. మీరు చేసిన దాడుల కంటే ఏడు రెట్లు అధికంగా మా దాడి ఉంటుంది.
గాజాలో ఉన్న పాలస్తీయుల పట్ల సానుభూతి నాటకంతో డ్రామాలు చేస్తున్నారు. మేము గతంలో మీపై యుద్ధం చేశాం. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాం. మీలాగ ఒక్క దాడి కాదు. క్షిపణుల వర్షం కురిపిస్తాం. యూఎస్ తో సమన్వయం చేసకుంటూ ముందుకెళ్తాం. మేము, యూఎస్ కలిసి మిమ్మల్ని అంతమొందిస్తాం’ అని మాట్లాడిన వీడియో ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఇజ్రాయిల్ ప్రధాని.
צפו בעדכון חשוב ממני אליכם >> pic.twitter.com/hLLodqVnPz
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) May 4, 2025
కాగా, హౌతీ తిరుగుబాటు దారుటు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. మిస్సైల్ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.