Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains1
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Waqf Act Petitions: petitioners response to govt Arguments in SC Updates2
వక్ఫ్‌ చట్టం చట్టబద్ధతపై కాసేపట్లో ‘సుప్రీం’ విచారణ

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు మరోసారి రానున్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరపనుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వక్ఫ్‌ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్‌ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

Ambati Rambabu Complaint Against Seema Raja, Kiraak RP3
సీమ రాజా, కిర్రాక్‌ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి

గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్‌ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ వైఎస్సార్‌సీపీపై, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్‌సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్‌ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రొత్సహంతో వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్‌ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

KSR Comments Over PM Modi Amaravati Visit4
పవన్‌ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్‌!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్‌, పవన్లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

PM Modi Lauds 14 YO Cricket Sensation RR Vaibhav Suryavanshi5
‘కళ్లుచెదిరే ప్రదర్శన.. వైభవ్‌ ఆట ఆకట్టుకుంది’

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్‌తో అందరికంటా పడిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్‌లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు. కళ్లుచెదిరే ప్రదర్శనఈ సందర్భంగా క్రీడాకారుల కష్టాన్ని కొనియాడిన ఆయన వైభవ్‌ విధ్వంసక శతకాన్ని ఆ వీడియో సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ‘బిహార్‌ ముద్దుబిడ్డ వైభవ్‌ సూర్యవంశీ. అతను ఆడిన మ్యాచ్‌ను చూశాను. 14 ఏళ్ల కౌమార ప్రాయంలోనే కళ్లుచెదిరే ప్రదర్శన కనబరిచాడు.ఇన్నాళ్లు ఏ భారత బ్యాటర్‌కు సాధ్యంకానీ రికార్డును సాధించిన ఘనత వైభవ్‌కే దక్కుతుంది. ఇంతచిన్న వయసులో అంతటి ఇన్నింగ్స్‌ ఆడటం మాటలు కాదు. దీనికోసం అతనెంతో కష్టపడ్డాడు. ఆటకోసం తపించాడు. అంకితభావంతో ముందడుగు వేశాడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అని ఆ సందేశంలో ప్రశంసల మోదీ వర్షం కురిపించారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంతో తమ ప్రభుత్వం క్రీడాకారుల సాఫల్యం కోసం కృషిచేస్తోందని చెప్పారు. అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలిమన భారత అథ్లెట్లు క్రికెట్, హాకీలే కాదు కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలని ప్రధాని సూచించారు. గ్రామీణ క్రీడ ఖో–ఖోతో పాటు గట్కా, మల్లకంభ, యోగాసన తదితర కొత్త క్రీడల్ని ‘ఖేలో–ఇండియా’లో భాగం చేశామని చెప్పారు. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.వేగవంతమైన సెంచరీఈ టీనేజ్‌ కుర్రాడు వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో విధ్వంసరచన చేశాడు. కేవలం 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీగా నిలిచింది. 30 బంతుల్లో గేల్‌ చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌పై సెంచరీ చేసిన తర్వాత వైభవ్‌ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో ఈ కుర్రాడు విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో డకౌట్‌ అయిన వైభవ్‌.. ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, వైభవ్‌ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడని.. తప్పక తన పొరపాట్లను సరిచేసుకుంటాడని పలువురు మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలుస్తున్నారు.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్‌

Allu Aravind Visited To Sri Tej Who Recently Shifted To Rehabilitation Centre6
శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.

Today gold and silver rates in Telugu states7
పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Trump slaps 100% tariff on foreign films8
దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై సుంకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్‌ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్‌.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్‌ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్‌.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్‌ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్‌ వార్‌’లో భాగంగా హాలీవుడ​ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్‌ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్‌, వార్నర్‌ బ్రోస్‌ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

ALL Party Meeting In Pakistan Over India Tension9
యుద్దానికి రెడీ.. పాక్‌లో అఖిలపక్ష భేటీలో ఆర్మీ అధికార ప్రతినిధి

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్‌ దాడులు చేస్తుందనే కారణంగా పాక్‌కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్‌ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా యుద్ధ సన్నద్దతపై వివరణ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. భారత్‌ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్‌ అలర్ట్‌ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌తో నెలకొన్న పరిస్థితులను సివిల్‌, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్‌ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ హాజరు కాలేదని సమాచారం.ఇదిలా ఉండగా.. భారత్‌ పర్యటనకు ముందు పాక్‌లో పర్యటిస్తున్న ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్‌లో దిగిన వెంటనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని వ్యాఖ్యాలు చేశారు. ఇక, అంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమని అబ్బాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Viral Video: Man Secretly Recording Son Singing10
ఎంత పనిచేశావ్‌ నాన్న..! హార్ట్‌ టచింగ్‌ వీడియో..

మన టాలెంట్‌ మన కన్నవాళ్లకి తెలిసినట్టుగా మరెవరకి తెలియదు. మనల్ని మనం నమ్మకపోయినా..మన తల్లిదండ్రులకు మాత్రం అపార నమ్మకం ఉంటుంది. బహుశా ఆ ప్రేమే పిల్లల్ని ప్రయోజకులుగా మారుస్తుందేమో ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇక్కడొక తండ్రి తన కొడుకు టాలెంట్‌ని చూసి సంబరపడటమే కాదు సీక్రెట్‌గా రికార్డు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మనసుని టచ్‌ చేసే ఈ ఘటన ఎవ్వరినైనా కదిలిస్తుంది. ఆ వీడియోలో ఓ బాలుడు మంచం మీద కూర్చొని హాయిగా పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఓ పక్కన బ్యాగులో పుస్తకాలు సద్దుతూ..పంజాబీ ఫేమస్‌‌ పాట “దో గల్లన్” పాడుతున్నట్లు కనపడుతుంది వీడియోలో. అతడు ఆ పాటని మైమరిచిపోయి పాడుతున్నాడు. పైగా లయబద్ధంగా అందంగా ఆలపించాడు. దాన్ని మొత్తం అతడి తండ్రి తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేస్తూ. చివర్లో అది చూసి కొడుకు స్టన్‌ అయిపోతాడు. కాసేపటికి తేరుకుని ఏంటి నాన్న అంటూ మాట్లాడటంతో ముగిసిపోతుంది ఆ వీడియో. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి..ప్రోత్సహించే పద్ధతి ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఏ చిన్నారులకైనా తమలోని టాలెంట్‌కి మొదటి విమర్శకులు తల్లిదండ్రులే..వారు స్పందించే తీరే ఆ రంగంలో పిల్లలు ఎదగడానికి, విజయం సాధించడానికి కారణమవుతుంది కదూ..!. View this post on Instagram A post shared by 🤍☘️ (@_bhangraempire_) (చదవండి: రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ నంది వడ్డెమాన్‌గా..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement