Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Questions AP Government Over Axis Power Deal1
నోరు మెదపరేం చంద్రబాబు!

సాక్షి,తాడేపల్లి: దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కూటమి సర్కార్‌ కనీవినీ ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. ఈ విద్యుత్‌ కొనుగోలుపై వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక యూనిట్‌ను రూ.2.49పైసలకే కొనుగోలు చేస్తే విషం చిమ్మిన మీరు ఇప్పుడు ఏకంగా రూ.4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు’అని ప్రశ్నించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వచ్చే 25 ఏళ్ల పాటు ఒక్క యూనిట్ విద్యుత్‌ను రూ.4.80కి కొనుగోలు చేయనుంది. ఈ ధర, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల కంటే రెండింతలు ఎక్కువ. దీని ప్రభావం రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడనుంది. అందుకే ఇది విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా నిలుస్తోంది. 'Axis' of Loot - 'Power'ed By Naidu-nomicsThe TDP-led coalition government has signed a power deal with Axis Energy to buy electricity at Rs 4.80 per unit for 25 years. This deal is almost double the rate of earlier agreements and will place a heavy burden on the people of… pic.twitter.com/UW7ueXBm97— YSR Congress Party (@YSRCParty) May 5, 2025మరి దీనిపై చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు. ఈ ఒప్పందం ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చే, ప్రజలకు భారమయ్యే ప్రణాళికతో చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ట్వీట్‌లో పేర్కొంది.

earthquake in telangana2
earthquake: తెలంగాణలో పలు చోట్ల భూకంపం

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్‌ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్‌ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Pat Cummin Becomes First-Ever Captain With THIS Record3
ప్యాట్‌ కమ్మిన్స్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. త‌న అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాప‌ర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే క‌రుణ్ నాయ‌ర్‌ను ఔట్ చేసి త‌న జ‌ట్టుకు అద్బుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ త‌ర్వాత మూడో ఓవ‌ర్ మొద‌ట బంతికి ఫాఫ్ డుప్లెసిస్‌, ఐదో ఓవ‌ర్ మొద‌టి బంతికి అభిషేక్ పోరెల్‌ను క‌మ్మిన్స్ పెవిలియ‌న్‌కు పంపాడు. క‌మ్మిన్స్‌ ఓవ‌రాల్‌గా త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 19 ప‌రుగులిచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో క‌మ్మిన్స్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో అత్య‌ధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా క‌మ్మిన్స్ చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లే ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేకపోయాడు. అక్షర్ పటేల్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), జహీర్ ఖాన్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), షాన్ పోలాక్‌(ముంబై ఇండియన్స్‌) వంటి కెప్టెన్లు ఐపీఎల్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని కమ్మిన్స్ అధిగమించాడు.మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల న‌ష్టానికి ఢిల్లీ 133 ప‌రుగులు చేసింది. 29 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీని స్ట‌బ్స్‌(41 నాటౌట్‌), ఆశుతోష్ శ‌ర్మ‌(41) ఆదుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్ మూడు, ఉన‌ద్క‌ట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, మలింగ తలా వికెట్ సాధించారు.

Mock drills across states in India on May 74
Mock drills: భారత్‌లో మాక్‌ డ్రిల్‌.. 1971భారత్-పాక్‌ యుద్ధ సమయంలో

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ జరిగింది. అదే సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్,‌ హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.

Heavy Rain In Hyderabad May 5th5
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షంఅనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. Raining in Nampally #HyderabadRains pic.twitter.com/Np4eJ5jUlN— Weatherman Karthikk (@telangana_rains) May 5, 2025 #Hyderabadrains Now scattered intense thunder storm rains for going in Hyderabad City not good news for #SRHvsDC Hope after 10:30 rain reduce chance high let's see ⛈️⚠️ pic.twitter.com/I6KNqEDfYK— Telangana state Weatherman (@tharun25_t) May 5, 2025 Lighting caught on camera in Tolichowki SHAIKPET Manikonda Golconda areas#tolichowki#manikonda#Hyderabad #hyderabadrains@balaji25_t @Hyderabadrains pic.twitter.com/jOWHSnLLSH— TajKeProperties (@Mawt777) May 5, 2025

UPI Users Would Experience Better Transaction Services From 2025 June 16th6
UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది.

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains7
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

DRDO, Navy conduct successful trial of MIGM8
డీఆర్‌డీవో, నేవీల ఎమ్‌ఐజీఎమ్‌ పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: ట్రయల్‌ రన్‌లో భాగంగా భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), నేవీలు సంయుక్తంగా ప్రయోగించిన మల్టీ ఇన్ ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్‌ పరీక్ష పరీక్ష విజయవంతమైంది. ఈరోజు(సోమవారం) ఎమ్ఐజీమ్(Multi Influence Ground Mine) ను భారత నేవీ, డీఆర్‌డీవోలు విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. The @DRDO_India and @indiannavy successfully undertook combat firing (with reduced explosive) of the indigenously designed and developed Multi-Influence Ground Mine (MIGM). Raksha Mantri Shri @rajnathsingh has complimented DRDO, Indian Navy and the Industry on this… pic.twitter.com/pOvynpBcr5— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 5, 2025ఈ మేరకు డీఆర్డీఓకు నేవీ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ వ్యవస్థ భారత నావికాదళం యొక్క సముద్రగర్భ యుద్ధ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Putin calls PM Modi, condemns Pahalgam incident9
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్‌ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన పుతిన్‌.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

Jagadeka Veerudu Athiloka Sundari Remuneration For Chiranjeevi And Sridevi10
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్‌ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్‌ ఎంత..? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల కానుంది.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్‌ వండర్‌ వెనక చాలామంది ఛాంపియన్స్‌ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్‌, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్‌, డీఓపీ విన్సెంట్‌, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్‌ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్‌ స్టోన్‌ , ఓ హిస్టారికల్‌ ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.మే 9న రీ-రిలీజ​ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్‌ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్‌ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్‌ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్‌ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్‌ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement