రాజీనామాల పై వెనక్కి తగ్గేది లేదు | YSRCP- MPs Gets Call From Speaker On Resignations | Sakshi
Sakshi News home page

రాజీనామాల పై వెనక్కి తగ్గేది లేదు

May 22 2018 9:38 AM | Updated on Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు  లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను స్పీకర్‌ కార్యాలయంలో కలవనున్నట్లు హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌ వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement