ఎన్నికలు సమీపిస్తున్నవేళ మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్సార్ జిల్లాలో గురువారం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.