రిబ్బన్‌ కట్టారు..సిజర్‌ మరిచారు.. | No scissors for inauguration, furious Murli Manohar Joshi tears off ribbon | Sakshi
Sakshi News home page

రిబ్బన్‌ కట్టారు..సిజర్‌ మరిచారు..

Published Thu, Feb 22 2018 6:22 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌ కలెక్టరేట్‌లో సోలార్‌ లైట్‌ ప్యానెల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కట్‌ చేసేందుకు సిజర్‌ లేకపోవడంతో విసుగెత్తిన ఎంపీ, సీనియర్‌ బీజేపీ నేత డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషీ చేత్తోనే చించివేసి మమ అనిపించారు.

 ఆ తర్వాత మరోసారి రిబ్బన్‌ కట్టి సిజర్‌ను సిద్దం చేస్తున్న అధికారులను ఎంపీ వారించారు. ప్రారంభోత్సవం అయిపోందని, మరోసారి హడావిడి అవసరం లేదని సదరు అధికారికి క్లాస్‌ తీసుకున్నారు. అధికారిని ఉద్దేశించి..‘ఈ కార్యక్రమం నిర్వాహకులు మీరేనా..? ప్రారంభోత్సవం నిర్వహించేది ఇలాగేనా..మీ ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.మరోసారి లాంఛనంగా ప్రారంభించాలని కోరగా అవసరం లేదంటూ అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగారు. మొత్తం కార్యక్రమం వీడియోలో రికార్డయింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement