అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సజీవ దహనమైన ఘటన చిత్తూరు జిల్లా బోయకొండ సమీపంలోని భవాని నగర్‌లో చోటుచేసుకుంది. భవానీ నగర్‌కి చెందిన శ్రీరాములు కుమారుడు శివ(35). ఇతను అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులు ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతున్నాడు.