ఉద్యోగాల కోసం యువత భారీ ర్యాలీ..

హౌరా : పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న ఉపాధి సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వామపక్ష, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో యువత హౌరా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ హౌరా జిల్లాలోని బెంగాల్‌ సచివాలయం వరకూ ఈ ప్రదర్శనను 12 వామపక్ష, విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్నాయి. హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో గురువారం ప్రారంభమైన ర్యాలీ తాజాగా హౌరాలో అడుగుపెట్టింది. నిరసనకారులు నబన్న (బెంగాల్‌ సెక్రటేరియట్‌)వైపు దారితీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లతో​వారిని అడ్డుకుంటున్నారు. నియంత్రణలను ఉల్లంఘించి దూసుకొస్తున్న యువతపై ఖాకీలు లాఠీచార్జి చేస్తూ ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top