హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి చివరి లేఖ | Hari Krishna's last letter to his fans | Sakshi
Sakshi News home page

హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి చివరి లేఖ

Aug 29 2018 11:51 AM | Updated on Mar 22 2024 11:30 AM

సీనియర్‌ నటులు నందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్‌ 2) తన పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ ఇలా అర్థాంతరంగా మృతిచెందటంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

మరో నాలుగు రోజుల్లో 62వ పుట్టిన రోజును జరుపుకోబోతున్న హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. ‘ సెప్టెంబర్‌ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది  నిరాశ్రయులైనారు.

Advertisement
 
Advertisement
Advertisement