వెంటిలేటర్‌పై బాలు: వీడియో వైరల్
చెన్నై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఎస్పీ బాలు మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు వెంటిలేటర్‌పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు బాలు. కొద్ది సేపటి తర్వాత అలసటతో ఆయన ఆపేశారు.
వైద్యులు మళ్లీ చేయించే ప్రయత్నం చేయగా బాలు చేతులు కదపలేక వద్దని వారించారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. దాదాపు 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి