చెన్నై-న్యూఢిల్లీ విమాన చార్జీల ధరలు ఆకాశాన్నంటాయి. వర్దా తుపాను ప్రభావం కారణంగా చెన్నై-న్యూఢిల్లీ వెళ్లే విమానం టికెట్ల ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న విమాన టిక్కెట్ల ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ-చెన్నై వెళ్లే విమాన టికెట్ ధర రూ.24,792లు, కోల్ కతా నుంచి చెన్నై వచ్చే విమానం టిక్కెట్ ధర రూ.17,283లు గా ఉన్నాయ. అదే చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధర ఏకంగా రూ.52,000లుగా ఉంది.