ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

Oct 7 2025 3:35 AM | Updated on Oct 7 2025 3:35 AM

ఐదు ఇ

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ముదిగొండ: ముదిగొండ మండలంలోని గంధసిరి, పెద్దమండవ పరిధి మున్నేటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు సీజ్‌ చేశారు. సువర్ణాపురం క్రాస్‌ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇసుక తరలింపునకు అనుమతి లేదని గుర్తించి సీజ్‌ చేశామని సీఐ మురళి తెలిపారు. ఈమేరకు డ్రైవర్లు, యాజమానులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

క్షతగాత్రురాలికి డీసీహెచ్‌ఎస్‌ చేయూత

రఘునాథపాలెం: ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయురాలికి ఆ మార్గంలో వెళ్తున్న డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజశేఖర్‌గౌడ్‌ తక్షణ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. కొణిజర్ల మండలం పెద్దగోపతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన మాధవి సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఖమ్మం వెళ్తుండగా వీవీపాలెం స్టేజీ వద్ద కుక్క అడ్డు రావడంతో స్కూటీ అదుపు తప్పగా కిందపడింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో పక్కనే షాప్‌లో ఉన్న నాగవాణి సీపీఆర్‌ చేసింది. అంతలోనే అదే మార్గంలో వెళ్తున్న డాక్టర్‌ రాజశేఖర్‌గౌడ్‌ తన కారులో ఆమెకు చికిత్స చేస్తూ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫలితంగా మాధవికి ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు

సత్తుపల్లిటౌన్‌: పాఠశాలకు వెళ్తున్న చిన్నారులపై వీధికుక్కలు దాడిచేయగా గాయాలయ్యాయి. సత్తుపల్లి జేవీఆర్‌ పార్క్‌ ఎదురుగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ సముదాయం నుంచి పాత సెంటర్‌ ప్రభు త్వ పాఠశాలకు సోమవారం విద్యార్థులు వెళ్తుండగా వీధికుక్కలు వెంబడించాయి. దీంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పరుగు పెట్టారు. రెండో తరగతి విద్యార్థులు అబ్దుల్‌రషీద్‌, జి.శ్రావణ్‌కుమార్‌ను కుక్కలు వెంబడించి కరవడంతో గాయాలు కాగా తల్లిదండ్రులు చికిత్స చేయించారు.

రైలుకింద పడి ఆత్మహత్య

బోనకల్‌: బోనకల్‌ రైల్వేస్టేషన్‌ సమీపాన ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని తూటికుంట్లకు చెందిన గందమాల సారధి(34) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఐదు నెలల క్రితం భార్య విడిచిపెట్టి వెళ్లడంతో తరచూ మద్యం సేవించేవాడు. ఈక్రమాన ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకున్నారు. ఇంతలోనే బోనకల్‌ స్టేషన్‌ సమీ పాన మృతదేహం ఉండడంతో పరిశీలించగా సారధిగా గుర్తించారు. ఈమేరకు ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపారు.

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌
1
1/2

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌
2
2/2

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement