
కోటమైసమ్మ జాతర ఆదాయం రూ.29.10లక్షలు
కారేపల్లి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కారేపల్లి మండలం ఉసిరికాయపల్లిలో నిర్వహించిన శ్రీ కోటమైసమ్మతల్లి జాతర సోమవారంతో ముగిసింది. ఈమేరకు భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఓ కె.వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పర్సా పట్టాభిరామారావు ఆధ్వర్యాన సోమవారం లెక్కించారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతర ద్వారా మొత్తం రూ.29,10,386 ఆదాయం సమకూరగా, హుండీల ద్వారా రూ.7,41,764 కానుకలు వచ్చాయని వెల్లడించారు. గత ఏడాది జాతర ఆదాయం రూ.27,17,949కాగా ఈ ఏడాది రూ.29,10,386 రావడంతో రూ.1.92లక్షల మేర పెరిగినట్లయింది. అలాగే, గత ఏడాది హుండీల ద్వారా రూ.7,33,549 వస్తే ఈసారి రూ.8,215 పెరిగి రూ.7,41,764గా నమోదైంది. ఇక పూజా టికెట్ల ద్వారా గత ఏడాది రూ.5,51,700, ఈ ఏడాది రూ.4,95,290, షాపుల వేలం ద్వారా గత ఏడాది రూ.8,34,000, ఈ ఏడాది రూ.9,64,500 ఆదాయం వచ్చింది. లెక్కింపులో దేవాదాయ శాఖ సిబ్బంది పగడాల మోహన్‌కృష్ణ, తోటకూరి వెంకటేశ్వర్లు, పర్సా సాయిలలిత్, మూడ్ మోహన్‌చౌహాన్, బోడ బన్సీలాల్ పాల్గొన్నారు.
గత ఏడాది కంటే రూ.1.92లక్షలు ఎక్కువ