నేడు మంత్రి తుమ్మల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి తుమ్మల పర్యటన

Oct 7 2025 4:23 AM | Updated on Oct 7 2025 4:23 AM

నేడు

నేడు మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధి 46వ డివిజన్‌ జూబ్లిపురలో సీసీ రోడ్డు, డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, సారథినగర్‌ వద్ద రామాలయం సమీపాన అభివృద్ధి పనులను మంత్రిప్రారంభించనున్నారు.

పెద్దాస్పత్రిలో

లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌(డీ అడిక్షన్‌, రీహాబిలిటేషన్‌ సెంటర్‌)ను ఏర్పాటుచేశారు. ఈ సెంటర్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించి మాట్లాడుతూ డ్రగ్స్‌ మహమ్మారిని జిల్లా నుండి పారదోలేలా అందరూ సహకరించాలని సూచించారు. అలాగే, పిల్లలు, యువత పక్కదారి పట్టకుండా మార్చడాన్ని బాధ్యతగా భావించాలని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్‌కు బానిలైన వారిని సెంటర్‌కు తీసుకొస్తే చికిత్స చేయడమే కాక కౌన్సెలింగ్‌ ఇస్తారని చెప్పారు. లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రతీ శనివారం ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్‌ పరింటెండెంట్‌ ఎం.నరేందర్‌, మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సౌమ్య, వైద్యులు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

మెడికల్‌ కళాశాలలో 100 సీట్లు భర్తీ

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 2025–26 ఏడాదికి గాను పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. జాతీయ కోటాలో 15 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లోనే భర్తీ కాగా, రాష్ట్ర స్థాయి కోటా కింద కేటాయించిన 85 సీట్లలో సోమవారం నాటికి విద్యార్థులు చేరారు. వంద సీట్లలో సగం మంది జిల్లాకు చెందిన వారే ఉండడం విశేషం. త్వరలోనే మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనుండగా జాతీయ కోటా విద్యార్థుల్లో ఒకరిద్దరు వెళ్లినా, ఆ స్థానాలు భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.

బీజేపీ జిల్లా నూతన

కార్యవర్గం

ఖమ్మం మామిళ్లగూడెం: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా నూతన కార్యవర్గాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు సోమవారం ప్రకటించారు. ఈమేరకు జిల్లా ఉపాధ్యక్షులుగా వీరవెల్లి రాజేష్‌, సుదర్శన్‌ మిశ్రా, బానోత్‌ రవిరాథోడ్‌, నకిరకంటి వీరభద్రం, బట్టు వీరంరాజు, బండారు నరేష్‌ నియమితులయ్యారు. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా గుత్తా వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్‌కుమార్‌, నాయుడు రాఘవరావు, జిల్లా కార్యదర్శులుగా పమ్మి అనిత, కుంచం కృష్ణారావు, తమ్మెర రజినీరెడ్డి, రామసెట్టి నాగేశ్వరరావు, తొండేపు సైదేశ్వరరావు, పల నాగసురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇంకా కోశాధికారిగా కొణతం లక్ష్మీనారాయణ, మీడియా కన్వీనర్‌గా నెల్లూరి బెనర్జీ, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌గా కందుల శ్రీకృష్ణ, ఐటీ ఇన్‌చార్జ్‌గా బోయినపల్లి సురేష్‌, కార్యాలయ కార్యదర్శిగా నక్కల రవిగౌడ్‌ను నియమించినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తూనే ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడాలని కోటేశ్వరరావు నూతన కార్యవర్గానికి సూచించారు.

సీజేఐపై దాడి గర్హనీయం

ఖమ్మంలీగల్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడి గర్హనీయమని ఆలిండియా లాయర్‌ యూనియన్‌ బాధ్యులు పేర్కొన్నారు. దీన్ని స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ కమిటీల ఆధ్వర్యాన మంగళవారం కోర్టు ప్రాంగణాల్లో నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని బార్‌ అసోసియేషన్‌ బాధ్యులు ఖండించగా.. రాజ్యాంగ విలువలపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం జిల్లా కోర్టులో నిరసన తెలపాలని అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

నేడు మంత్రి తుమ్మల  పర్యటన
1
1/1

నేడు మంత్రి తుమ్మల పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement