
ఉద్యోగ విరమణ జీవితంలో కీలకఘట్టం
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల జీవితంలో రిటైర్‌మెంట్ అనేది కీలకఘట్టమని డీఆర్వో పద్మశ్రీ అన్నారు. సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను కలెక్టరేట్‌లో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖలో సహాయ అభివృద్ధి అధికారి ఎం.ఈదయ్య, వెటర్నరీ శాఖ ఆఫీస్ సబార్డినేట్ జి.సావిత్రి చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ముప్ఫై ఏళ్లకు పైగా సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీతలు వారి ఉద్యోగ అనుభవాలను వివరించారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.